టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు రాములు టీఆర్ఎస్లో చేరారు..
- April 21, 2016
మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు రాములు గురువారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మహబూబ్‌నగర్‌కు చెందిన రాములు, ఆయన అనుచరులను సీఎం కేసీఆర్ గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై బంగారు తెలంగాణ కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. వెనుకబడిన పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. పాలమూరులో సాగునీటి ప్రాజెక్టులతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు. రాములుతోపాటు అచ్చంపేట సింగిల్ విండో చైర్మన్ నర్సింహారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు టీఆర్ ఎస్ లో చేరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







