‘బహ్రెయిన్ ఫోరమ్ ఫర్ డైలాగ్’కు అమృతస్వరూపానంద

- November 01, 2022 , by Maagulf
‘బహ్రెయిన్ ఫోరమ్ ఫర్ డైలాగ్’కు అమృతస్వరూపానంద

బహ్రెయిన్: మాతా అమృతానందమయి మఠం వైస్-ఛైర్మెన్, అమృత విశ్వ విద్యాపీఠం (అమృత విశ్వవిద్యాలయం) అధ్యక్షుడు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు  స్వామి అమృతస్వరూపానంద పూరి “బహ్రెయిన్ ఫోరమ్ ఫర్ డైలాగ్: ఈస్ట్ అండ్ వెస్ట్ ఫర్ హ్యూమన్ కోఎక్సిస్టెన్స్” కు హాజరు కానున్నారు. నవంబర్ 3-6 తేదీల్లో హిస్ హోలీనెస్ పోప్ ఫ్రాన్సిస్ బహ్రెయిన్ లో పర్యటించనున్నవిషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా 200 మంది సర్వమత నాయకులతో “బహ్రెయిన్ ఫోరమ్ ఫర్ డైలాగ్: ఈస్ట్ అండ్ వెస్ట్ ఫర్ హ్యూమన్ కోఎక్సిస్టెన్స్” ను నిర్వహించనున్నారు. స్వామి అమృతస్వరూపానంద పూరి ప్రఖ్యాత మానవతావాది. ప్రముఖ ఆధ్యాత్మిక నాయకురాలు శ్రీ మాతా అమృతానందమయి దేవి (అమ్మ) ప్రధాన శిష్యుడు. 1970వ దశకం చివరి నుంచి అమృతపురి ఆశ్రమంలో ఆయన నివసిస్తున్నారు. తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అమృతస్వరూపానంద.. ప్రఖ్యాత రచయిత, అనువాదకుడు. ది ఇర్రెసిస్టిబుల్ అట్రాక్షన్ ఆఫ్ డివినిటీ (2019),  ది కలర్ ఆఫ్ ది రెయిన్బో: కారుణ్య నాయకత్వం (2014), ‘అమ్మ’ జీవిత చరిత్ర తదితర 10 కంటే ఎక్కువ సంపుటాల సంభాషణలను ఇంగ్లిషులోకి అనువదించారు.  అమృతస్వరూపానంద ఇప్పటివరకు 30 కంటే ఎక్కువ సార్లు ప్రపంచ దేశాలను చుట్టివచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com