‘కాంతారా’ డిమాండ్ అక్కడ కూడా తగ్గేదే లే.!

- November 01, 2022 , by Maagulf
‘కాంతారా’ డిమాండ్ అక్కడ కూడా తగ్గేదే లే.!

కన్నడ మూవీ ‘కాంతారా’ ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. వీక్‌డేస్, వీకెండ్స్ అనే తేడా లేకుండా నిలకడగా వసూళ్లు కొనసాగుతున్నాయ్ ఈ సినిమాకి. 
ధియేటర్లలో స్టడీగా రన్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలో రిలీజైతే చూసేందుకు ఓ వర్గం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘కాంతారా’ ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. 
భారీ మొత్తానికి ఈ సినిమాని కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్. అయితే, పెద్ద సినిమాలైనా సరే, విడుదలైన రుండు, మూడు వారాల తర్వాత ఓటీటీల్లో సందడి చేసేస్తున్నాయ్. కానీ, ‘కాంతారా’ ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
ధియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ఓటీటీలో అప్పుడే రిలీజ్ చేసేందుకు ఇష్టపడట్లేదట నిర్మాతలు. అయితే, తాజాగా అమెజాన్ ప్రైమ్ నిర్వాహకులు సరికొత్త ప్లాన్ చేశారట. ఈ సినిమాని రెంటల్ బేస్‌లో మొదట రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట. అందుకోసం మరో సర్ప్రైజింగ్ ఫిగర్‌ని ఆఫర్ చేస్తున్నారట. 
దాంతో నిర్మాతలు ఓకే చేసేటట్లు తెలుస్తోంది. అలా కూడా ఈ సినిమాకి లాభాలు చేకూరబోతున్నాయన్న మాట. బహుశా నవంబర్ సెకండ్ వీక్‌లో ‘కాంతారా’ మూవీ రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి రానుందనీ తెలుస్తోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com