మోర్బీ వంతెన బాధితులను పరామర్శించిన ప్రధాని మోడీ
- November 01, 2022
గుజరాత్: గుజరాత్ లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలి 141 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. మంగళవారం మోర్బీలో పర్యటించారు. ముందుగా ఘటనాస్థలిని సందర్శించి పరిశీలించారు. ఆ తర్వాత హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న బాధితుల వద్దకు చేరుకుని వారి కుటుంబాలను పరామర్శించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన వారిని కూడా ప్రధాని మోడీ కలిశారు. ఆపరేషన్ గురించి ఆరా తీశారు.
అనంతరం ఎస్పీ కార్యాలయంలో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మోర్బీలో రెస్క్యూ ఆపరేషన్ ను వేగవంతం చేయాలని కోరారు. కేబుల్ వంతెన ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యలపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అధికారులు ప్రధాని మోదీకి వివరించారు. ఇక ఈ ఈ ప్రమాదంలో దాదాపు 141 మందివరకు మరణించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. అటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







