2023 నాటికి కువైట్‌లో 10,000 సిదర్ చెట్ల ప్లాంటేషన్
- November 02, 2022
కువైట్: పర్యావరణాన్ని సంరక్షించే స్వచ్ఛంద సేవకులు సహాయంతో 2023 నాటికి అరిఫ్జాన్‌లోని సిద్ర్ సహజ రిజర్వ్‌లో 10,000 సిద్ర్ (జిజిఫస్ స్పినా-క్రిస్టి) చెట్లను నాటాలని యోచిస్తున్నట్లు పర్యావరణ కార్యకర్త, అల్-సిద్ర్ ప్లాంట్ రిజర్వ్ వ్యవస్థాపకుడు ఒబైద్ అల్-షెమ్మరి తెలిపారు. ఇందులో భాగంగా 3,000 సిద్ర్ చెట్ల పెంపకాన్ని పూర్తి చేశామన్నారు. 2018లో ప్రత్యేకంగా 450 చెట్లను నాటినట్లు పేర్కొన్నారు. సామాజిక భాగస్వామ్యంతో మరో 3,000 సిద్ర్ చెట్లను సహజ రిజర్వ్ ప్రాంతంలో నాటినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మొత్తంగా 10,000 సిద్ర్ చెట్లను నాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు అల్-షెమ్మరి వివరించారు. దీనితో సిద్ర్ జాతీయ ఖర్జూరం, తేనె ఇతర ఉపయోగకరమైన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. సిద్ర్ సహజ రిజర్వ్ వద్ద సిద్ర్ చెట్లను నాటడానికి వాలంటీర్లు చేతులు కలిపారని, కువైట్‌ను సుందరీకరించడం, అభివృద్ధి చేయడం కోసం ప్రాజెక్ట్‌లలో పాల్గొనేలా జూనియర్ సిటిజన్‌లను ప్రోత్సహించడానికి జాతీయ విధానానికి అనుగుణంగా చొరవ తీసుకున్నట్లు యూత్ పబ్లిక్ అథారిటీ ప్రతినిధి అస్రార్ అల్-అన్సారీ తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







