యూఏఈలో నెలకు Dh5 నిరుద్యోగ బీమా: వివరాలు
- November 03, 2022
యూఏఈ: ఫెడరల్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు 2023 జనవరి 1 నుండి కొత్త నిరుద్యోగ బీమా పథకానికి సభ్యత్వం పొందవచ్చని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) ప్రకటించింది. బీమా పథకం రెండు రకాలుగా నిర్ణయించారు. మొదటిది Dh16,000 అంతకంటే తక్కువ ప్రాథమిక జీతం ఉన్నవారికి వర్తిస్తుంది. ఈ కేటగిరీలో బీమా చేయబడిన ఉద్యోగికి ప్రీమియం నెలకు Dh5 (లేదా సంవత్సరానికి Dh60)గా సెట్ చేయబడింది. రెండవ కేటగిరీలో 16,000 దిర్హామ్‌లకు మించిన ప్రాథమిక వేతనం ఉన్నవారు ఉన్నారు. బీమా ప్రీమియం కింద నెలకు Dh10 (లేదా సంవత్సరానికి Dh120)గా నిర్ణయించారు. స్కీమ్ కోసం ప్రీమియంలను ఉద్యోగులు స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది.ఈ కొత్త బీమా పథకాన్ని తొమ్మిది స్థానిక బీమా కంపెనీలతో కలిసి అమలు చేసేందుకు సంబంధించిన ఒప్పందంపై మంత్రత్వ శాఖ ఒప్పందం చేసుకున్నది.
పరిహారం ఇలా..
ఈ పథకంలో చేరిన ఉద్యోగులు ఏదైనా కారణంగా ఉద్యోగాన్ని కోల్పోతే, ప్రతి క్లెయిమ్‌కు మూడు నెలల వరకు నగదు పరిహారం అందుతుంది. నెలవారీ పరిహారం విలువ మొదటి కేటగిరీకి Dh10,000, రెండవ దానికి Dh20,000 మించకుండా అందుతుంది. బీమా కవరేజీ పరిహారం ప్రాథమిక జీతంలో 60 శాతం చొప్పున నెలవారీగా లెక్కించబడుతుంది. బీమా చేసిన వ్యక్తి తప్పనిసరిగా మూడు ఆమోదించబడిన ఛానెల్‌ల ద్వారా క్లెయిమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఉద్యోగులు కనీసం 12 నెలల పాటు పనిచేసి, బీమా పథకంలో చేరినట్లయితే పరిహారానికి అర్హులు. ఉద్యోగులు దేశం విడిచి వెళ్లినా లేదా కొత్త ఉద్యోగంలో చేరినా పరిహారం పొందేందుకు అర్హులు కాదు.
అయితే, బీమా పథకం నుండి మినహాయించబడిన వారిలో పనిచేసే సంస్థల యజమానులు, గృహ సహాయకులు, తాత్కాలిక ఉద్యోగ ఒప్పందం కలిగిన ఉద్యోగులు, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువకులు, పదవీ విరమణ పెన్షన్ పొంది కొత్త ఉద్యోగంలో చేరిన పదవీ విరమణ చేసినవారు అనర్హులు. కాగా, కమీషన్ ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగి కూడా ఈ పథకానికి సభ్యత్వం పొందవచ్చు.
సభ్యత్వం పొందాలంటే..
ఉద్యోగులు బీమా పూల్ వెబ్‌సైట్, స్మార్ట్ అప్లికేషన్, బ్యాంక్ ATMలు, కియోస్క్ మెషీన్‌లు, వ్యాపార సేవా కేంద్రాలు, మనీ ఎక్స్ఛేంజ్ కంపెనీలు.. మంత్రిత్వ శాఖ నిర్ణయించిన ఏదైనా ఇతర ఛానెల్ ద్వారా బీమా పథకానికి సభ్యత్వాన్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







