విమానాశ్రయాలలో బయోమెట్రిక్ టెక్నాలజీతో టచ్‌లెస్ బోర్డింగ్‌

- November 03, 2022 , by Maagulf
విమానాశ్రయాలలో బయోమెట్రిక్ టెక్నాలజీతో టచ్‌లెస్ బోర్డింగ్‌

యూఏఈ: ప్రయాణీకుల ముఖ లక్షణాలను వారి పాస్‌పోర్ట్‌గా ఉపయోగించే అధునాతన బయోమెట్రిక్ టెక్నాలజీని ప్రారంభించేందుకు యూఏఈలోని విమానాశ్రయాలు సిద్ధమవుతున్నాయి. సాంకేతికత స్మార్ట్ కెమెరాలను ఉపయోగించి ప్రయాణీకుల ముఖాన్ని గుర్తించడం ద్వారా వారు ప్రయాణించడానికి క్లియరన్స్ ఇస్తుంది. బోర్డింగ్‌కు ముందు అదే సమాచారంతో ఇది మరింత వేగంగా బోర్డిండ్ ప్రాసెస్ ను పూర్తి చేస్తుంది. ఈ విధానంలో బోర్డింగ్ సంబంధిత పత్రాలను మళ్లీ సమర్పించాల్సిన అవసరం ఉండదు. ఏవియేషన్ పరిశ్రమలో బయోమెట్రిక్ టెక్నాలజీని ఉపయోగించడం అనేది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇంది విమానయాన రంగంలో గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు. ప్రయాణించే విధానాన్ని ఈ టెక్నాలజీ పూర్తిగా మార్చేస్తుందని విమానయాన రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త టెక్నాలజీ మొదటి దశ ప్రస్తుతం అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) సమన్వయంతో పరీక్షించబడుతోందని అబుదాబి విమానాశ్రయాల మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జమాల్ సలేం అల్ ధాహెరి తెలిపారు. ఇప్పటికే యూఎస్  ఇమ్మిగ్రేషన్ ప్రీక్లియరెన్స్ సర్వీస్ అబుధాబిలో అమలు చేస్తున్నారు.  ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్ సెక్యూరిటీ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ మాట్లాడుతూ.. “ఈ అధునాతన సాంకేతికత బయోమెట్రిక్ డేటా రికార్డులను ఉపయోగించడం ద్వారా ప్రయాణీకుల కస్టమర్ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. పాస్‌పోర్ట్‌లు లేదా బోర్డింగ్ పాస్‌లను సమర్పించాల్సిన అవసరం లేకుండా కేవలం బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి చెక్ ఇన్ చేయడానికి, ఇమ్మిగ్రేషన్‌ను క్లియర్ చేయడానికి, లాంజ్‌లను యాక్సెస్ చేయడానికి, వారి విమానాలను ఎక్కడానికి అనుమతిస్తుంది” అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com