వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచిన యూఏఈ, సౌదీ సెంట్రల్ బ్యాంకులు
- November 03, 2022
యూఏఈ: ఓవర్‌నైట్ డిపాజిట్ ఫెసిలిటీ (ODF)కి వర్తించే బేస్ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచాలని యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE) నిర్ణయించింది. దీంతో వడ్డిరేట్లు 3.15% నుండి 3.90%కి చేచాయి. పెరిగిన వడ్డిరేట్లు నవంబర్ 3 నుండి అమలులోకి రానున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ నవంబర్ 2న రిజర్వ్ బ్యాలెన్స్‌లపై (IORB) వడ్డీని 75 బేసిస్ పాయింట్లు పెంచుతూ చేసిన ప్రకటన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, CBUAE అన్ని స్టాండింగ్ క్రెడిట్ సౌకర్యాల ద్వారా స్వల్పకాలిక లిక్విడిటీని రుణం తీసుకోవడానికి వర్తించే రేటును బేస్ రేటు కంటే 50 బేసిస్ పాయింట్ల వద్ద కొనసాగించాలని నిర్ణయించింది.
వడ్డీ రేటును పెంచిన సౌదీ సెంట్రల్ బ్యాంక్
ద్రవ్య, ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించాలనే లక్ష్యానికి అనుగుణంగా సౌదీ సెంట్రల్ బ్యాంక్.. వడ్డీ రేట్ల రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచి 4.5 శాతానికి చేసింది. దీంతో రివర్స్ రెపో రేటు 75 బేసిస్ పాయింట్లు పెరిగి 4.00 శాతానికి చేరింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







