సుధీర్ బాబు హిట్ ఫార్ములా భలే పట్టేశాడే.!

- November 03, 2022 , by Maagulf
సుధీర్ బాబు హిట్ ఫార్ములా భలే పట్టేశాడే.!

ఓ సినిమా హిట్ అయితే చాలు అదే ఫార్మేట్‌లో వరుసగా సినిమాలు రావడం.. కొన్నాళ్ల పాటు సక్సెస్ కొట్టడం జరుగుతుంటుంది. ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయమే ఇది సినీ ఇండస్ట్రీ లో. తాజాగా హిట్ ఫార్ములా అంటే, దేవుడికి లింకప్ అయిన కథలు. అందులోనూ కృష్ణుడికి సంబంధించిన కథలయితే, నో డౌట్ సూపర్ హిట్టే.. అని ‘కార్తికేయ 2’ ప్రూవ్ చేసింది. అలాగే, ‘కాంతార’ తదితర సినిమాలు కూడా దేవుడితో లింకప్ అయిన కథలే. భాషతో సంబంధం లేకుండా సక్సెస్ అందుకున్నాయి ఇటీవలి కాలంలో. 
ఇక, యాస మరో ప్రధాన ఆకర్షణ. ‘పుష్ఫ’ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసను పట్టాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సినిమాలో కంటెంట్ వుందా.? లేదా.? అని చూడలేదు. సూపర్ హిట్ కట్టబెట్టేశారంతే.
దాంతో యాస కూడా ప్రధానమే అని మేకర్లు డిసైడ్ అయిపోయారు. ఇక, ఈ రెండు హిట్ ఫార్ములాలని తన సినిమాలో మిక్స్ చేసి సూపర్ హిట్ కొట్టేందుకు సిద్ధమంటున్నాడు హీరో సుధీర్ బాబు.
‘హరోం హర’ అనే టైటిల్‌తో సుధీర్ బాబు ఓ సినిమా చేస్తున్న సంగతి ఇటీవలే అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. జ్ఞానశేఖర్ ద్వారక దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లింక్ చేస్తున్నాడట సుధీర్ బాబు. అలాగే, కుప్పం బ్యాక్ డ్రాప్‌లో సినిమా రూపొందుతుండడంతో, చిత్తూరు యాసలోనే ఈ సినిమాలోని డైలాగులు వుండబోతున్నాయట. ఇంకేముంది. ఈ రెండు సక్సెస్ ఫార్ములాలూ చాలవా.? సుధీర్ బాబు హిట్ కొట్టడానికి. సుధీర్ బాబు ఎంచుకున్న సినిమా అంటేనే కంటెంట్ ఖచ్చితంగా వుంటుందన్న నమ్మకం ఎలాగూ వుంది. సో, ‘హరోం హర’ సుధీర్ బాబుకి హిట్ సినిమా అవుతుందేమో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com