ఎన్టీయార్, అల్లు అర్జున్ ఆ కథ కోసం పోటీ పడుతున్నారా.?
- November 03, 2022
ఎన్టీయార్ - కొరటాల కాంబినేషన్లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఈ సినిమా స్ర్కిప్టు విషయంలో ఫైనల్ డెసిషన్ రాక ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు స్క్రిప్ట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
కొరటాల సినిమాలంటే ఖచ్చితంగా సందేశాత్మకంగానే వుంటాయ్. ‘ఆచార్య’ దెబ్బ కొట్టింది కానీ, గతంలో కొరటాల తన సినిమాలతో ఫెయిలైందే లేదు. లేటైనా లేటెస్టుగా రావాలంటూ కాస్త ఎక్కువే టైమ్ తీసుకుని పక్కా ప్రణాళికతో వస్తున్నాడిప్పుడు కొరటాల. ఆ నేపథ్యంలోనే ఎన్టీయార్ సినిమా కోసం కొరటాల మెడికల్ మాఫియాని టచ్ చేస్తున్నట్లుగా లీకులొస్తున్నాయ్.
మరోవైపు అల్లు అర్జున్ కూడా ‘పుష్ప 2’ కోసం మెడికల్ మాఫియానే కథాంశంగా ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి, ఎన్టీయార్ కూడా ఇదే పాయింట్ టచ్ చేస్తాడా.?
గతంలోనూ మెడికల్ మాఫియాకి సంబంధించి వచ్చిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయ్. ‘గణేష్’, ఠాగూర్’ సినిమాలు అందుకు సాక్ష్యాలు. అయితే, ఎన్టీయార్, అల్లు అర్జున్ ఈ ఇద్దరిలో ఎవరు ఈ పాయింట్‌ని టచ్ చేయబోతున్నారనేది కొంత కాలం వెయిట్ చేస్తే కానీ తెలీదు.
అల్లు అర్జున్ సినిమా అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. కానీ, ఎన్టీయార్ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. మరో రెండు, మూడు నెలల తర్వాత కానీ, ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సే లేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







