‘హిట్ ది సెకండ్ కేస్’‌ని ఇన్వెస్టిగేట్ చేసేందుకు సిద్ధమైన అడవి శేష్.!

- November 03, 2022 , by Maagulf
‘హిట్ ది సెకండ్ కేస్’‌ని ఇన్వెస్టిగేట్ చేసేందుకు సిద్ధమైన అడవి శేష్.!

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా ‘హిట్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ బ్యానర్‌పై నేచురల్ స్టార్ నాని రూపొందించిన ఈ సినిమా ప్రశాంత్ త్రిపురనేని దర్శకుడు. 
చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకి సీక్వెల్ వుండబోతోందని అప్పట్లోనే హింట్ ఇచ్చారు చిత్ర యూనిట్. 
అందుకు తగ్గట్లుగానే అడవి శేష్ హీరోగా ‘హిట్ 2’ స్టార్ట్ అయ్యింది. ‘హిట్ ది సెకండ్ కేస్’ అంటూ రెండో పార్ట్‌ని రిలీజ్ చేస్తున్నారు. డిశంబర్‌లో రానున్న ఈ సినిమాకి సంబంధించి లేటెస్టుగా ఓ టీజర్ రిలీజ్ చేశారు.
అనుమానాస్పద రీతిలో చనిపోయిన ఓ అమ్మాయి మర్డర్ మిస్టరీని ఛేదించే స్పెషల్ క్రైమ్ ఆఫీసర్‌గా డిఫరెంట్ ఆటిట్యూడ్‌తో ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు అడవి శేష్ ఈ సినిమాలో.  
‘హిట్’ మొదటి పార్ట్‌లో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించగా, ఈ పార్ట్‌లో ‘ఖిలాడీ’ పేమ్ మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఆసక్తిగా కట్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథనాన్ని చాలా గ్రిప్పింగ్‌గా తెరకెక్కించినట్లు అర్ధమవుతోంది ప్రోమోస్ చూస్తుంటే. చూడాలి మరి సినిమాని ఎలా హ్యాండిల్ చేశారో.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com