చంద్రబాబు నాయుడు రోడ్ షోలో ఉద్రిక్తత..
- November 04, 2022
అమరావతి: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో లో ఉద్రిక్తత నెలకొంది. ఓ దుండగుడు చంద్రబాబు కాన్వాయ్ పైకి రాయి విసిరాడు. పూలలో రాయి పెట్టి దాన్ని విసిరాడు. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయమైంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనతో సెక్యూరిటీ సిబ్బంది మరింత అలర్ట్ అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నందిగామ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వాహనంపై విజయవాడ ఎంపీ కేశినేని నానితో కలిసి జనాలకు అభివాదం చేసుకుంటూ చంద్రబాబు ముందుకు సాగారు.
ఈ సమయంలో చంద్రబాబు వెనకాలే నిలుచున్న చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుపై ఒక్కసారిగా రాయి పడింది. దీంతో ఆయనకు గాయమైంది. చంద్రబాబుకు కేంద్రం జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సెక్యూరిటీ బృందానికి నేతృత్వం వహిస్తున్న మధుపైనే రాయి పడి గాయపడ్డారు. తనకు దెబ్బ తగలి రక్తం కారుతుండటంతో విషయాన్ని ఆయన చంద్రబాబుకు తెలిపారు.
దీనిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నాని చేతిలోని మైకును తీసుకుని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తన రోడ్ షోకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అంతు చూసే వరకు నిద్ర పోనంటూ రాయి విసిరిన వ్యక్తులను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా చంద్రబాబు హెచ్చరించారు.
చంద్రబాబు సెక్యూరిటీలో రెండు బృందాల NSG కమాండోలు కలిశాయి. 12 మంది బృందంతో భద్రతను కట్టుదిట్టం చేసింది NSG. ఆరుగురు స్థానంలో భద్రతలోకి 12 మంది కమాండోలు వచ్చారు. కాగా, చంద్రబాబు రోడ్ షో కు జనం పోటెత్తారు. కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. భారీ వాహన ర్యాలీ కారణంగా రెండు గంటలు ఆలస్యంగా టూర్ నడుస్తోంది.
మరోవైపు చంద్రబాబు రోడ్ షో లో పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. రోడ్ షో తొందరగా వెళ్లాలంటూ టీడీపీ నాయకుల పై పోలీసులు ఒత్తిడి తెచ్చారు. పోలీసులు ఒత్తిడి చేయడంతో టీడీపీ నేతల వారితో వాగ్వాదానికి దిగారు. రోడ్ షోకు అనూహ్యంగా జనం తరలి రావడంతో పోలీస్ అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. చంద్రబాబు వాహనానికి ముందు, వెనుక పెద్ద ఎత్తున రోప్ పార్టీలు ఉన్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా చంద్రబాబు ప్రచార రథం చుట్టూ అదనపు భద్రతా దళాలు మోహరించారు.
తాజా వార్తలు
- నా పేరుతో వచ్చే ఫేస్ బుక్ మెసేజ్ లను నమ్మకండి:సీపీ సజ్జనార్
- భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు
- కె ల్యాండ్ టూరిజం, ఎంటర్ టైన్ ప్రాజెక్ట్ లో సందడి..!!
- గాజాపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంయుక్త ప్రకటన..!!
- దుబాయ్ లో స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తికి జీవిత ఖైదు..!!
- కొత్త పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా జెడ్డా సెంట్రల్..!!
- ప్రైవేట్ రంగంలో రిటైర్ ఎంప్లాయిస్ కు గుడ్ న్యూస్..!!
- రుస్తాక్లోని తావి అల్-హరా మార్కెట్లో వింటర్ క్రాప్..!!
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి







