రష్మిక హవా మళ్లీ మొదలైందిగా.!

- November 05, 2022 , by Maagulf
రష్మిక హవా మళ్లీ మొదలైందిగా.!

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది రష్మిక మండన్నా. ఇటీవల రష్మిక నుంచి పెద్దగా అప్‌డేట్స్ రావడం లేదు. ‘పుష్ప’ సినిమా తర్వాత రష్మిక ఎక్కడా కనిపించింది లేదు. బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది. 
అక్కడ వరుస ప్రాజెక్టులతో ఫుల్‌గా క్రేజ్ దక్కించుకుంటోంది. ఇక, ఇప్పుడు సౌత్‌లో రష్మిక హవా మళ్లీ మొదలైంది. రష్మిక నటించిన ‘వారిసు’ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. ఈ అప్‌డేట్‌తో మళ్లీ రష్మిక ఫ్యాన్స్‌లో హుషారు మొదలైంది.
తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న బైలింగ్వల్ మూవీ ఇది. వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకుడు కాగా, దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లను ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కూడా ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నారు.
థమన్ సంగీతం అందించిన ఈ సినిమాని తెలుగులో ‘వారసుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రేస్‌లో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించబోతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com