'హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్’ రెండో ఎడిషన్ లో పాల్గొన్న 3 వేలకి పైగా పాల్గొన్న రన్నర్లు
- November 05, 2022
హైదరాబాద్: ‘హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రన్ 2022’ సెకెండ్ ఎడిషన్ ఈ వేళ ఘనంగా ముగిసింది.‘రన్... ఈట్... ప్లే... రిపీట్’ అనే థీమ్‌తో నిర్వహించి ఈ వినూత్నమైన ఈవెనింగ్ రన్ దాదాపు రెండేళ్ల తర్వాత తిరిగి ప్రారంభమైంది.ఈ పోటీలలో దాదాపు 3 వేల మందికి పైగా రన్నర్లు 5 కే, 10 కే ఈవెంట్లలో పాల్గొన్నారు.
అందరికీ సుపరిచితుడైన సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఈ పోటీలను ప్రారంభించారు.ఈ ఏడాది ఈ పోటీలలను 4 విభాగాలలో–18 నుంచి 40 ఏళ్లు (పురుషులు), 18 నుంచి 40 ఏళ్లు (స్త్రీలు), 40 ఏళ్ల పైన (పురుషులు), 40 ఏళ్ల పైన (స్త్రీలు), నిర్వహించారు. శ్రీ ప్రదీప్ పణికర్, సీఈఓ, GHIAL ఈ పోటీలలో విజేతలకు మెడల్స్, బహుమతులను ప్రదానం చేసారు. మొదటి విజేతకు రూ.40,000, రెండు మూడో స్థానాలలో నిలిచిన వారికి రూ.20,000, రూ.10,000 అందజేసారు.
4 విభాగాలలోని విజేతలు
18 to 40 yrs (Men)
Dhanavat Pralhad Ramsing
Rameshchandra Ramavath
Het Ram
18 to 40 yrs (Women)
Bharti Nain
Golla Maheshwari
K Vishalakshi
40 yrs and above (Men)
Sunil Shivane
Aswini Acharya
Jagan Reddy
40 yrs & above (Women)
Suparna Das
Chaitra Nataraj
Jyotiprova Dutta Khanikar
ప్రదీప్ పణికర్, ‘‘మొదటి ఎయిర్పోర్ట్ రన్‌కు లభించిన ప్రోత్సాహంతో రన్నర్లు, నగరంలోని ఇతర ఔత్సాహికుల కోసం యేటా మేం దీనిని నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. ఈ వేదిక కేవలం ఆరోగ్యానికి దోహదపడడమే కాకుండా, సమైక్య భావనను కూడా కల్పిస్తుంది. కోవిడ్ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత పున:ప్రారంభమైన ఈ రన్ మరింత ఉత్సాహంగా ప్రారంభమై, దీనికి ఊహించని ప్రతిస్పందన లభించింది. దీనిని విజయవంతం చేసిన రన్నర్లు, స్పాన్సర్లు, మా భాగస్వాములు, నిర్వహకులకు మా కృతజ్ఞతలు’’ అన్నారు.
ఎయిర్పోర్ట్ రన్ తర్వాత త్రీయరీ బ్యాండ్ మరియు గాయకులు రామ్ మిరియాల, భార్గవి పిళ్లై తమ అద్భుతమైన సంగీతంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.వేదిక వద్ద జుంబా డ్యాన్స్, ఫ్లీ మార్కెట్, పిల్లల కోసం ప్లే జోన్, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసారు. విమానాశ్రయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల కోసం వినోద కార్యకలాపాలు ఏర్పాటు చేశారు.
ఫిబ్రవరి 2020లో నిర్వహించిన మొట్టమొదటి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రన్ విజయవంతమైంది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుండి మరియు భారతదేశం అంతటా ఉన్న కొంతమంది విదేశీ పౌరులతో సహా 2 వేల మందికి పైగా దానిలో పాల్గొన్నారు.

తాజా వార్తలు
- వాట్సాప్‌లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్‌లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









