రామ్ పోతినేనిని లైన్‌లో పెట్టబోతున్న ‘జాతిరత్నాలు’ డైరెక్టర్.!
- November 05, 2022
‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ రీసెంట్‌గా ‘ప్రిన్స్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. అయితే, ‘జాతిరత్నాలు’ మాదిరి ‘ప్రిన్స్’ ఆకట్టుకోలేకపోయింది. అయినా మనోడి క్రేజ్ తగ్గలేదనుకోండి.
ముగ్గురు ప్రముఖ నిర్మాతల్ని లైన్‌లో పెట్టేశాడట. అందులో ఎవరో ఒకరితో త్వరలో న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ఛాన్సెస్ వున్నట్లు తెలుస్తోంది.
యంగ్ హీరో రామ్ పోతినేని కోసం అనుదీప్ ఓ కథని సిద్ధం చేశాడనీ తెలుస్తోంది. రామ్ ఇమేజ్‌కి తగ్గట్లుగా మంచి ఎంటర్‌టైనింగ్ కాన్సెప్ట్ అనీ తెలుస్తోంది. ఆధ్యంతం నవ్వులు పూయించేలా ఈ సినిమాలోని కామెడీ ఆకట్టుకోనుందట.
అయితే, ప్రస్తుతం రామ్ పోతినేని, బోయపాటి శీను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదికి కానీ ఈ సినిమా పూర్తయ్యే అవకాశాల్లేవు. ఒకవేళ అన్నీ కుదిరి ప్రాజెక్ట్ సెట్ అయితే, ఈ సినిమా వచ్చే ఏడాదిలో పట్టాలెక్కే అవకాశాలున్నాయ్. చూడాలి మరి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







