ఒమన్‌లో రికార్డు స్థాయిలో వాహన రిజిస్ట్రేషన్లు

- November 06, 2022 , by Maagulf
ఒమన్‌లో రికార్డు స్థాయిలో వాహన రిజిస్ట్రేషన్లు

మస్కట్: నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన తాజా డేటా ప్రకారం.. సెప్టెంబర్ 2022 చివరి నాటికి ఒమన్ సుల్తానేట్‌లో నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 1.58 మిలియన్లకు చేరుకుంది. ఒమన్‌లో నమోదైన మొత్తం వాహనాల్లో ప్రైవేట్ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలు 1,260,833 (79.5 శాతం) ఉన్నాయి. వాణిజ్య రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల సంఖ్య 236,867(14.9%)కి చేరుకున్నాయి. అదే సమయంలో టాక్సీ వాహనాలు 28,186(1.8 శాతం)కి చేరాయి. అద్దె వాహనాల సంఖ్య 26,932(1.7 శాతం)కి చేరుకున్నాయి. ప్రభుత్వ వాహనాల సంఖ్య 12,158 కాగా.. మోటార్‌బైక్‌ల సంఖ్య 6,623గా ఉంది. అలాగే ట్యూటరింగ్ వాహనాల సంఖ్య 5,806 , తాత్కాలిక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాల సంఖ్య 7,438గా ఉంది. వీటితోపాటు వ్యవసాయ ట్రాక్టర్ల సంఖ్య 1,284, దౌత్య సంస్థల రిజిస్ట్రేషన్లు కలిగిన వాహనాలు 820 ఉన్నాయని ఎన్సీఎస్ఐ తన నివేదికలో వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com