దుబాయ్ రైడ్: భారత తొలి రాకెట్ ప్రయోగానికి నివాళులు
- November 07, 2022
యూఏఈ: ఈ సంవత్సరం నిర్వహించిన దుబాయ్ రైడ్‌లో భారతదేశం మొదటి రాకెట్ ప్రయోగానికి భారత ప్రవాస అజ్మల్ పోయాక్కర మహమూద్ నివాళులర్పించి నివాసితుల దృష్టిని ఆకర్షించాడు. తెల్లటి చొక్కా, బూడిద రంగు ప్యాంటు ధరించి 1963 నాటి ఛాయాచిత్రం జ్ఞాపకార్థం తన చక్రం వెనుక ఒక కోన్ లాంటి వస్తువును తీసుకువెళ్లాడు. ఇది భారతదేశం మొట్టమొదటి అంతరిక్ష రాకెట్‌ను కేరళలోని తుంబ నుండి ప్రయోగానికి రవాణా చేయడాన్ని గుర్తుచేసింది. దీని గురించి అజ్మల్ పోయాక్కర మహమూద్ మాట్లాడుతూ.. నవంబర్ 1963లో తుంబా నుండి రాకెట్ ప్రయోగించబడింది. రోజువారీ కార్యకలాపాలు లేదా రాకెట్ ప్రయోగం వంటి చరిత్రను మార్చే సంఘటనల కోసం సైకిళ్లు ఎల్లప్పుడూ ప్రజల జీవితంలో ఎలా అంతర్భాగంగా ఉన్నాయో చాటి చెప్పాలనుకుని ఇలా చేశానన్నారు.
తుంబ రాకెట్ ప్రయోగం
మత్స్యకార గ్రామమైన తుంబా అయస్కాంత భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రదేశం. 1963 నవంబర్ లో రాకెట్ ప్రయోగానికి సరైన ప్రదేశంగా గుర్తించారు. ఆ స్థలంలో ఒక చిన్న చర్చి ఉంది. చర్చి బిషప్ తన సంఘం అనుమతితో అంతరిక్ష పరిశోధన కార్యక్రమానికి ఆ చర్చిని విరాళంగా ఇచ్చారు. దీంతో బిషప్ ఇల్లు ఒక కార్యాలయంగా మారింది. చర్చి ఒక వర్క్‌షాప్‌గా రూపాంతరం చెందింది. పశువుల కొట్టాలు రాకెట్ సామాగ్రి నిల్వ కేంద్రాలు, ప్రయోగశాలలుగా ఉపయోగపడ్డాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







