పర్వత శిఖరం నుండి పడిన యువకుడిని రక్షించిన రెడ్ క్రెసెంట్ బృందాలు
- November 07, 2022
టబుక్ : వాయువ్య టబుక్ ప్రాంతంలో కపర్వత ప్రాంతంలో కొండపై నుండి పడిపోయిన సౌదీ యువకుడిని సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ బృందాలు రక్షించాయి. గాయపడిన 30 ఏళ్ల పౌరుడిని తబుక్‌లోని కింగ్ సల్మాన్ మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. తబుక్‌లోని అథారిటీ బ్రాంచ్ డైరెక్టర్ జనరల్ నవాఫ్ అల్-అంజీ మాట్లాడుతూ.. శర్మ-తబుక్ రోడ్‌లోని కొండపై నుండి ఒక పౌరుడు పడిపోయినట్లు కమాండ్, కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందిందని చెప్పారు. వెంటనే అధికార నమీ సెంటర్ నుండి అంబులెన్స్ బృందం సంఘటనా స్థలానికి బయలుదేరిందన్నారు. సదరు యువకుడు చేరుకోవడం కష్టంగా ఉండే పర్వత ప్రాంతంలో చిక్కుకున్నట్లు గుర్తించి.. కఠినమైన పరిస్థితుల్లో రెస్క్యూ కార్యకలాపాలను నిర్వహించడానికి ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక బృందానికి సమాచారం అందించారు. ఆ బృందం ఆ యువకుడిని రక్షించి, తబుక్‌లోని కింగ్ సల్మాన్ మిలిటరీ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఇలాంటి సంఘటనలు ఏవైనా జరిగితే టోల్-ఫ్రీ నంబర్ 997కి కాల్ చేసి అత్యవసర సేవను పొందాలని ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







