300 కోట్లతో 'బెల్' పరిశ్రమ 24న శంకుస్థాపన..
- April 21, 2016
300 కోట్లతో పరిశ్రమ 24న శంకుస్థాపన ఎన్టీఆర్ స్వగ్రామం, కృష్ణా జిల్లా నిమ్మకూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) పరిశ్రమ రానుంది. రూ.300కోట్ల పెట్టుబడితో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 24న బెల్ సీఎండీ సునీల్‌కుమార్ శర్మ దీనికి శంకుస్థాపన చేయనున్నారు. పామర్రు మండలం బచ్చుపేట వేంకటేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 50.5ఎకరాల భూమిని ఈ కంపెనీకి కేటాయించారు. భూమికి కంపెనీ రూ.14 కోట్లు చెల్లించింది. బెల్ పరిశ్రమకు శంకుస్థాపన అనంతరం గ్రామస్థుల అభినందన సభ జరగనుంది. ఇందులో బెల్ సీఎండీతో పాటు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా పాల్గొంటారు. నిమ్మకూరు గ్రామాన్ని దత్తత తీసుకున్న లోకేష్ ఈ గ్రామానికి బెల్ పరిశ్రమ వచ్చేందుకు కృషి చేశారు. నిశావీక్షణ కళ్లద్దాలు(నైట్‌విజన్ గ్లాసెస్), తదితర ఉత్పత్తులను ఇక్కడ చేపడతారు. పరిశ్రమ మొదటి దశ పూర్తికావడానికి ఏడాదిన్నర కాలం పట్టనుంది. ఇజ్రాయెల్ సంస్థ భాగస్వామ్యంతో మలిదశ కూడా అభివృద్ధి చేసేలా బెల్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఈ ప్రాజెక్టు వల్ల నిమ్మకూరు చుట్టుపక్కల గ్రామాల్లోని వెయ్యిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని స్థానిక తెదేపా నేతలు చెప్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







