‘బిగ్’ షాక్.! గీతక్కకు గుడ్ బై చెప్పేసిన బిగ్‌బాస్.!
- November 07, 2022
బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సీజన్ బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది గీతూ రాయల్. గలాటా గీతుగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
చిత్తూరు యాసతో డే వన్ నుంచీ బిగ్‌బాస్ హౌస్‌లో సమ్‌థింగ్ డిఫరెంట్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకుంది. మొదట్లో ఆమె యాస, బాస కాస్త ఇబ్బందిగా అనిపించినా అదే ఈ సీజన్ బిగ్‌బాస్‌కి ప్లస్ అయ్యింది. కేవలం గీతూ వల్లనే బిగ్‌బాస్‌కి కొద్దో గొప్పో టీఆర్‌పీ రేటింగులు పెరిగాయని చెప్పొచ్చు ఈ సీజన్‌కి.
చూస్తే ఈ సీజన్ బిగ్‌బాస్ కప్పు కూడా గీతక్కదే అని ఫిక్స్ అయిపోయారు కూడా బిగ్‌బాస్ వీక్షకులు. అలాంటిది, తొమ్మిదో వారానికొచ్చేసరికి, సీను రివర్స్ అయిపోయింది. గీతక్క ఎలిమినేట్ అయిపోయింది. అనూహ్యమైన ట్విస్ట్ ఇది.
గీతక్క ఎలిమినేషన్‌తో ఒక్కసారిగా బిగ్ హౌస్ మూగబోయింది. కంటెస్టెంట్లంతా శోక సంద్రంలో మునిగిపో్యారు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా గీతూ ఎలిమినేషన్‌తో కంటెస్టెంట్లు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, గీతూ కూడా బిగ్‌బాస్‌ని వదిలి వెళ్లనంటూ ఇక్కడే వుంటానంటూ.. వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఎలాగైనా కప్పు కొట్టాలన్నదే తన కల అంటూ హోస్ట్ నాగ్ ముందే ఏడ్చేసింది. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక హోస్ట్ నాగ్ సైతం సైలెంట్‌గా వుండిపోయాడు. ఏది ఏమైనా గీతూ ఎలిమినేషన్ మాత్రం షాకింగే అని చెప్పాలి.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







