తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్-ఖతార్ ఆధ్వర్యంలో మొదటి ఉచిత వైద్య శిబిరం

- November 08, 2022 , by Maagulf
తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్-ఖతార్ ఆధ్వర్యంలో మొదటి ఉచిత వైద్య శిబిరం

దోహా: తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్-ఖతార్ ఆధ్వర్యంలో మొదటి ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది.తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్-ఆస్టర్ మెడికల్ సెంటర్ తో కలిసి 200 మంది తక్కువ వేతనంతో పనిచేసే కార్మికులకు సేవలందించడం ద్వారా 1వ ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతంగా ముగించారు.

ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథి ఎస్.జేవియర్ ధనరాజ్- ప్రథమ కార్యదర్శి (కాన్సులర్ & కమ్యూనిటీ వ్యవహారాలు), ఇతర అతిథులు డాక్టర్ మోహన్ థామస్ (ప్రెసిడెంట్ ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్) ప్రసాదరావు (సలహా కమిటీ చైర్మన్ ICC) రజనీ మూర్తి (ICBF MC),కులదీప్ కౌర్ (ICBF MC)  వెంకప్ప భగవతుల (అధ్యక్షుడు) అంధర కళా వేదిక, డాక్టర్ నదీమ్ జిలానీ (అధ్యక్షుడు) AMU ఖతార్), కల్చరల్ ఫోరమ్ ఖతార్ నుండి మహమ్మద్ మరియు షిహాబ్ (అధ్యక్షుడు GKPB) , సజిత్ వి పిళ్లై మరియు నవీన్.టిడబ్ల్యుఎ వైద్య పరీక్షల కోసం వచ్చిన ప్రజలకు నీరు, పండ్లు మరియు స్నాక్స్ ఏర్పాటు చేసింది.

టిడబ్ల్యుఎ అధ్యక్షుడు ఖాజా నిజాముద్దీన్ టిడబ్ల్యుఎ టీమ్ మేనేజ్మెంట్ కమిటీ, సబ్ కమిటీ మరియు అడ్వైజరీ బోర్డ్ సభ్యులు చే నిర్వహించబడుతున్న ఈ ఉచిత వైద్య శిబిరం కృషి చేసిన వ్యక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు గులాం రసూల్. నవీద్ దస్తగిర్, నాగరాజు, రమేష్ పిట్ల, మహ్మద్ సలావుద్దీన్, మహ్మద్ తాహా, లుత్ఫీ ఖాన్, మహ్మద్ వసీం, మహ్మద్ యాకూబ్, ఇక్బాల్ అహ్మద్, మహ్మద్ సజీద్, తల్హా షబాత్, యావర్ ఖాన్, అతీఖ్ ఉర్ రహ్మాన్ మరియు అస్మత్.

ఈ వైద్య శిబిరాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ఆస్టర్ మేనేజ్మెంట్, వైద్యులు, ఆస్టర్ వాలంటీర్లు మరియు సిబ్బందికి మా హృదయపూర్వక మరియు ప్రత్యేక ధన్యవాదాలు.
టిడబ్ల్యుఎ బృందం ఈ ఉచిత వైద్య శిబిరం సహాయం అందించిన వైద్యులను మొమెంటో మరియు శాలువా తో సన్మానించడం జరిగింది మరియు డాక్టర్ మోహన్ థామస్ (ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు 2021) ని సన్మానించడం జరిగింది.
 
డా.మోహన్ థామస్ (ప్రెసిడెంట్ ఇండియన్ స్పోర్ట్స్ సెంటర్) గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న టిడబ్ల్యుఎ, వాలంటీర్లకు ప్రశంసా పత్రాలను అందజేసి, టిడబ్ల్యుఎ వాలంటీర్లను అభినందించారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com