జోరు మీదున్న కళ్యాణ్ రామ్.! కొత్త సినిమా షురూ చేశాడుగా.!

- November 08, 2022 , by Maagulf
జోరు మీదున్న కళ్యాణ్ రామ్.! కొత్త సినిమా షురూ చేశాడుగా.!

‘బింబిసార’ హిట్‌తో నందమూరి కళ్యాణ్ రామ్ జోరు పెంచాడు. తన తదుపరి చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ‘అమిగోస్’ అనే విచిత్రమైన టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లోగోతో పాటూ, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్లు. పోస్టర్‌పై ‘నీలా వున్న వాళ్లను నువ్వు కలిస్తే నువ్వు చచ్చిపోతావు.. అని వాళ్లు చెప్పారు..’ అని ఇంగ్లీష్‌లో రాసుంది. టైటిల్‌తో పాటూ, పోస్టర్ కూడా ఆసక్తి క్రియేట్ చేస్తుండడంతో, మరోసారి కళ్యాణ్ రామ్ ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. 
ఈ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌కి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో సినిమా రూపొందుతోంది. ఆషికా రంగనాధ్ ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌తో జత కడుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయబోతున్నాట్లు మేకర్లు ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com