జాన్వీ కపూర్ ఇలాంటి సినిమాలే ఎందుకు ఎంచుకుంటోంది.?
- November 08, 2022
అతిలోక సుందరి శ్రీదేవికి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. జాన్వీ సోషల్ మీడియా అకౌంట్ చూస్తేనేమో పక్కా కమర్షియల్. కానీ, స్ర్కీన్ మీద చూస్తే, జాన్వీ కపూర్ పూర్తిగా విభిన్నం.
హీరోయిన్ ఓరింయెంటెడ్, కథా బలం వున్న పాత్రల్లోనే నటిస్తోంది. జాన్వీ ఎందుకిలా చేస్తోంది.? అని నెటిజన్లు బుర్రలు బాదుకుంటున్నారు. అయితే, జాన్వీ కపూర్ మాత్రం తన పని తాను సైలెంట్‌గా చేసుకుంటూ పోతోంది.
తనను తాను నటిగా నిరూపించుకునే ప్రయత్నంలోని భాగమే ఇదంతా.. అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలా కథా నేపథ్యమున్న చిత్రాల్నే ఎంచుకుంటుంటే, కమర్షియల్ హీరోయిన్ అని ప్రూవ్ చేసుకునేదెప్పుడు.? వీటికే అలవాటు పడితే, ఆ తర్వాత కమర్షియల్ నటిగా చాన్సులు వస్తాయా.? కమర్షియల్ అనిపించుకుంటేనే కదా.. స్టార్ డమ్ వచ్చేది.? అని జాన్వీ డై హార్డ్ ఫ్యాన్స్ కలవరపడుతున్నారట.
ఇదే కలవరం జాన్వీలోనూ వుండాలి కదా. జాన్వీ మనసులో ఏముందో ఏమో. ఎవరికి ఎరుక.! ప్రస్తుతం జాన్వీ ‘మిలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘మిలి’కి ముందుకు ‘గుడ్ లక్ జెర్రీ’ అనే సినిమాలో నటించింది.
తాజా వార్తలు
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం