విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లోగో ఆవిష్కరించిన సీఎం జగన్
- November 08, 2022
అమరావతి: ఏపీకి పెట్టుబడులు రాబట్టే దిశగా వచ్చే ఏడాది మార్చిలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ సదస్సుకు సంబంధించిన లోగోను సిఎం జగన్ మంగళవారం తాడేపల్లి సీఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. 2023 మార్చి 2, 3, 4 తేదీల్లో వరుసగా 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను ఆయా పారిశ్రామిక దిగ్గజాలకు వివరించడంతో పాటుగా ఆయా కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
కరోనా కారణంగా గడచిన రెండేళ్లలో ఈ తరహా సదస్సులను నిర్వహించలేకపోయామని అమర్ నాథ్ తెలిపారు. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం జగనే వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశం ఉన్న రంగాలపై సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. స్టార్టప్స్, ఇన్నోవేషన్స్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ సూచించారన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఎవరితో పడితే వారితో తమ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోదని చెప్పిన మంత్రి…. పెట్టుబడులు పెట్టే సంస్థలతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







