కార్మికుల నియామకంలో అక్రమాలు.. కంపెనీ డైరెక్టర్‌కు Dh400,000 జరిమానా
- November 08, 2022
దుబాయ్: స్పాన్సర్‌షిప్ నిబంధనలను పాటించడంలో విఫలమైన దుబాయ్‌లోని ఓ మానవ వనరుల కన్సల్టింగ్ కంపెనీ డైరెక్టర్‌కు దుబాయ్‌లోని నేచురలైజేషన్ అండ్ రెసిడెన్సీ కోర్టు Dh400,000 జరిమానా విధించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. దేశంలో అక్రమంగా ఉంటున్న ఏడుగురు కార్మికులను అధికారులు అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమచారం మేరకు కన్సల్టింగ్ కంపెనీ డైరెక్టర్ తన స్పాన్సర్‌షిప్ కింద లేని కార్మికులను నియమించినట్లు గుర్తించారు. ఈక్రమంలో స్పాన్సర్‌షిప్ నిబంధనలు ఉల్లంఘించిన కన్సల్టింగ్ డైరెక్టర్ కు కోర్టు పెనాల్టీ విధించింది. అలాగే మరొక స్పాన్సర్ వద్ద పనిచేసినందుకు, చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్నందుకు ప్రతి కార్మికుడికి 1,000 దిర్హామ్‌ల జరిమానాను కోర్టు విధించింది. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల GO విడుదల..
- కనకదుర్గ ఆలయానికి నూతన పాలకమండలి..
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం
- ఇ-కార్ రేసు కేసులో ఇద్దరు ఐఎఎస్ఐ పై ఎసిబి విచారణ
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!