మౌంట్‌ ఎవరెస్ట్‌పైకి యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌

- April 22, 2016 , by Maagulf
మౌంట్‌ ఎవరెస్ట్‌పైకి యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌

యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మిలిటరీ టీమ్‌, ఖాట్మండూ చేరుకున్నాయి. నేపాల్‌ రాజధాని ఖాట్మండు నుంచి మౌంట్‌ ఎవరెస్ట్‌పైకి వెళ్ళేందుకు ఈ టీమ్‌ ప్రయత్నించనుంది. టీమ్‌లో మొత్తం 16 మంది ఉంటారు. ఇందులో 13 మిలిటరీలో వివిధ ర్యాంకులకు చెందినవారు. అందులో ఒకరు డాక్టర్‌, ముగ్గురు పర్వతారోహణలో నైపుణ్యం సాధించినవారు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరంగా పేరొందిన మౌంట్‌ ఎవరెస్ట్‌ని అధిరోహించడం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఈ టీమ్‌. రెండు నెలల్లో శిఖరాన్ని చేరుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్వతారోహణలో భాగంగా ఈ టీమ్‌ అనేకరకాలైన సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ముఖ్యంగా మంచు పర్వతాల్ని అధిరోహించేటప్పుడు ఆక్సిజన్‌ సరైన రీతిలో అందదు. అన్ని విధాలా శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ టీమ్‌ పర్వతారోహణకు సిద్ధమయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com