సమంతలాగే వరుణ్ ధావన్‌ కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నాడా.?

- November 10, 2022 , by Maagulf
సమంతలాగే వరుణ్ ధావన్‌ కూడా ఆ వ్యాధితో బాధపడుతున్నాడా.?

ఇటీవల నటి సమంత తనకున్న అరుదైన వ్యాధి మయో సైటిస్ గురించి చెప్పి, ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కూడా ఈ తరహా వ్యాధితోనే బాధపడుతున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో తెలియజేశారు.
తాను ‘వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వరుణ్ ధావన్ తెలియజేశారు. సమంతకున్న అరుదైన వ్యాధి మాదిరిగానే ఈ వ్యాధి లక్షణాలు కూడా వుంటాయట. విపరీతమైన నీరసం, కళ్లు తిరగడంతో పాటూ, వికారం, కంగారు వంటి లక్షణాలుంటాయట. మనిషి శారీరక సిస్టమ్‌పై తీవ్రమైన ప్రభావం చూపించే వ్యాధి అట.  
ఈ తీవ్రమైన వ్యాధితో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ బాధపడుతున్నాడట. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా..’ అని వరుణ్ ధావన్ సోషల్ వేదికగా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు.
కాగా, వరుణ్ ధావన్ త్వరలో ‘బేడియా’ సినిమాతో రాబోతున్నాడు. తెలుగులో ‘తోడేలు’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com