తెగ కష్టపడిపోతున్న సూపర్ స్టార్.! ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడా.?

- November 10, 2022 , by Maagulf
తెగ కష్టపడిపోతున్న సూపర్ స్టార్.! ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడా.?

ఫిట్‌నెస్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్వేస్ ఫర్‌ఫెక్ట్. సినిమా కోసం ప్రత్యేకంగా ఆయన ప్రయోగాలు చేసిందే లేదు. సిక్స్ ప్యాక్‌లు గట్రా జోలికి ఎప్పుడూ పోలేదు సూపర్ స్టార్ మహేష్ బాబు.
అయితే, మహేష్ తాజా సినిమా కోసం ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడనీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం. ఈ సినిమాలో చాలా స్టైలిష్‌గా కనిపించబోతున్నాడట సూపర్ స్టార్ మహేష్ బాబు. అలాగే, ఫిట్‌నెస్ విషయంలోనూ కాస్త డిఫరెంట్‌గా కనిపించబోతున్నాడనీ తెలుస్తోంది.
తాజాగా జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న వీడియోలూ, ఫోటోలూ నెట్టింట్లో హల్‌చల్ చేస్తుండడంతో, మహేష్ ఫ్యాన్స్ ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ సినిమాతో తమ అభిమాన హీరో ఏదో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడంటూ మురిసిపోతున్నారు. 
కష్టపడి వర్కవుట్లు చేస్తున్న మహేష్‌ని చూసి పండగ చేసుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ షూట్ కంప్లీట్ అయిపోయింది. రేపో మాపో సెకండ్ షెడ్యూల్ కోసమే మహేష్ ఇలా సిద్ధమవుతున్నట్లు అర్ధమవుతోంది. బుట్టబొమ్మ పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com