ఉమ్రా యాత్రికుల కోసం 2,764 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు

- November 11, 2022 , by Maagulf
ఉమ్రా యాత్రికుల కోసం 2,764 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు

జెడ్డా: ప్రస్తుత ఉమ్రా సీజన్‌లో వివిధ నగరాలు, ప్రాంతాలలో ఆరోగ్య సేవలను అందించే 2,764 కంటే ఎక్కువ కేంద్రాల నుండి యాత్రికులు, సందర్శకులు తమ ఆరోగ్య బీమాను ఉపయోగించి ప్రయోజనం పొందవచ్చని సౌదీ హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 151 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆసుపత్రులు మక్కా, మదీనాలకు వచ్చే యాత్రికులు, సందర్శకులకు సేవలను అందిస్తాయని తెలిపింది. వీటికి అదనంగా 773 ఆరోగ్య కేంద్రాలు, పాలీక్లినిక్‌లు,1,840 మెడికల్ ట్యాబ్ లు, ఫార్మసీలు యాత్రికులకు అందుబాటులో ఉంటాయన్నారు. సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రికులు, సందర్శకులకు ఆరోగ్య బీమా తీసుకోవడం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com