హోటల్‌కు నిప్పు పెట్టిన యువకుడికి ఏడేళ్ల జైలు శిక్ష

- November 11, 2022 , by Maagulf
హోటల్‌కు నిప్పు పెట్టిన యువకుడికి ఏడేళ్ల జైలు శిక్ష

బహ్రెయిన్: హోటల్‌కు నిప్పు పెట్టిన యువకుడికి మొదటి హై క్రిమినల్ కోర్ట్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అతను బుక్ చేసుకున్న గదికి నిప్పు పెట్టడం ద్వారా హోటల్‌కు జరిగిన నష్టపరిహారంతో కలిపి అతనికి BD 5,530 జరిమానా విధించింది. బాబ్ అల్-బహ్రెయిన్ సమీపంలోని మనామాలోని ఒక హోటల్‌లో ఈ ఘటన జరిగింది. తానున్న హోటల్ గదికి నిప్పు పెట్టడమే కాకుండా ఆ దృశ్యాలను వీడియో కూడా తీయడంతో.. భద్రతా దళాలు అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా..తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com