ఎన్టీయార్ - కొరటాల మొదలు పెట్టుడే తరువాయి.!
- November 12, 2022
ఎన్టీయార్ - కొరటాల ప్రాజెక్టుకు రంగం సిద్ధం కానుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీయార్ లుక్ రివీల్ చేశారు. లైట్ బియర్డ్, కాస్త రగ్గ్‌డ్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తున్న హెయిర్ స్టైల్‌లో ఎన్టీయార్ కనిపిస్తున్నాడీ లుక్స్‌లో.
తాజాగా ఈ లుక్ రివీల్ చేసి ఫ్యాన్స్‌లో హుషారు పెంచింది కొరటాల అండ్ టీమ్. అంతేకాదు, ఈ సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లుక్ బాగుంది. టైటిల్ కూడా అదిరిపోయింది. ఇక, ఎన్టీయార్ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. రేపో మాపో సినిమాని స్టార్ట్ చేసేయనున్నారన్న నమ్మకం కలిగింది.
డిశంబర్ నుంచి రెగ్యులర్ షూట్‌కి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడెప్పుడా.? అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఇప్పటికి ఓ కొలిక్కి వచ్చినట్టుందన్న మాట.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఎన్టీయార్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయ్. అలాగే ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!