సౌదీ అరేబియా వారంలో 16,493 మంది అరెస్ట్
- November 13, 2022
రియాద్ : రెసిడెన్సీ, కార్మిక చట్టాలు, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన దాదాపు 16,493 మందిని గత వారం రోజుల్లో సౌదీలోని వివిధ ప్రాంతాలలో అరెస్టు చేసినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నవంబర్ 3 నుండి 9 వరకు రాజ్యమంతటా భద్రతా దళాలు స్పెషల్ తనిఖీలు నిర్వహించాయని పేర్కొంది. అరెస్టులలో 9,441 మంది నివాస వ్యవస్థను ఉల్లంఘించినవారు, 4,580 మంది సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించినవారు, 2,472 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారని తెలిపింది. అలాగే సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తూ మరో 480 మంది అరెస్టయ్యారని పేర్కొంది. అరెస్టయిన వారిలో 63% మంది యెమెన్లు, 33% ఇథియోపియన్లు, 4% ఇతర జాతీయులు ఉన్నారన్నారు. రెసిడెన్సీ, పని నిబంధనలను ఉల్లంఘించేవారికి సహకరించిన 15 మంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం సౌదీలో మొత్తం 54,111 మంది వివిధ చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారని, వీరిలో 49,811 మంది పురుషులు, 4,300 మంది మహిళలు ఉన్నారని పేర్కొంది. 43,475 మందిని ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు, 2,675 మందిని ప్రయాణ రిజర్వేషన్లను పూర్తి చేయడానికి, 9,070 మందిని బహిష్కరించినట్లు తెలిపింది. ఎవరైనా చొరబాటుదారులకు సహకరించడం, ఆశ్రయం కల్పిండం లాంటివి చేస్తే.. అలాంటి వారికి గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, గరిష్టంగా SR1 మిలియన్ జరిమానా విధించబడుతుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్







