యూఏఈ ఎయిర్‌లైన్ చౌకైన ఆఫర్

- November 13, 2022 , by Maagulf
యూఏఈ ఎయిర్‌లైన్ చౌకైన ఆఫర్

యూఏఈ: Dh1 విమాన టిక్కెట్ల ఆఫర్ ను యూఏఈ బడ్జెట్ ఎయిర్‌లైన్ అయిన విజ్ ఎయిర్ అబుధాబి ప్రకటించింది. శీతాకాలం, పర్యాటక సీజన్ కోసం సరికొత్త ఆఫర్లను విజ్ ఎయిర్ అబుధాబి మేనేజింగ్ డైరెక్టర్ మైఖేల్ బెర్లూయిస్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత ఇంధన-సమర్థవంతమైన ఎయిర్‌క్రాఫ్ట్ A321 నియోను సరికొత్త ఇంజన్ టెక్నాలజీతో నడుపుతున్నామని, దాంతో 20 శాతం ఇంధనం డబ్బులు ఆదా అవుతున్నాయన్నారు. అదేవిధంగా ప్రయాణీకుల ఖర్చును తగ్గించడానికి.. ప్రతి విమానంలో ప్రయాణీకుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యల ద్వారా తమ కస్టమర్లకు తక్కువ ధరకే ఎయిర్‌లైన్‌ సౌకర్యాలను అందిస్తున్నామన్నారు. అలెగ్జాండ్రియా (ఈజిప్ట్), అల్మాటీ (కజకిస్తాన్), అమ్మన్ (జోర్డాన్), అంకారా (టర్కీ), అకాబా (జోర్డాన్), ఏథెన్స్ (గ్రీస్), బాకు (అజర్‌బైజాన్), బెల్గ్రేడ్ (సెర్బియా), దమ్మామ్ (సౌదీ అరేబియా), కువైట్ సిటీ (కువైట్), కుటైసి (జార్జియా), మనామా (బహ్రెయిన్), మలే (మాల్దీవులు), మస్కట్ (ఒమన్), నూర్ సుల్తాన్ (కజకిస్తాన్), సలాలా (ఒమన్), శాంటోరిని (గ్రీస్), సరజెవో (బోస్నియా), సోహాగ్ (ఈజిప్ట్), తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్), టెల్-అవివ్ (ఇజ్రాయెల్), టిరానా (అల్బేనియా), యెరెవాన్ (అర్మేనియా) లతోపాటు తదితర ఎంపిక చేసిన రూట్లలో సగటు ధర Dh179లో గమ్యస్థానాలకు చేరుకోవచ్చని వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com