రూమర్లకు అలా చెక్ పెట్టేసిన హీరోయిన్ స్నేహ.!
- November 14, 2022
సీనియర్ నటి స్నేహ, తన భర్తతో విడాకులు తీసుకుంటోందంటూ ఈ మధ్య ఓ వార్త సోషల్ మీడియాని కుదిపేస్తోంది. అదేంటీ.! చక్కగా భర్త, పిల్లలతో హాయిగా కాపురం చేసుకుంటోన్న స్నేహపై ఇలాంటి వార్తలెందుకు పుట్టాయి.. అంటూ స్నేహ అభిమానులు ఒకింత విస్మయానికి గురవుతున్నారు. ఎలా ఫుట్టిందో ఏమో కానీ, ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది.
ఈ వార్తలకు చెక్ పెట్టేలా తాజాగా స్నేహ, తన భర్తతో క్లోజ్‌గా దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. దాంతో, ఈ గాసిప్స్‌కి చెక్ పెట్టేసినట్లయ్యింది స్నేహ. స్నేహ, ప్రసన్న దంపతులు చూడముచ్చటైన జంట. పెద్దగా వివాదాల జోలికి కూడా పోని నటి స్నేహ.
అలాంటిది ఎలా పుట్టిందో ఏమో తెలీదు కానీ, ఈ వార్త పుట్టిందంటే, పెరిగింది.. అన్న చందాన తెగ హల్‌చల్ చేసింది సోషల్ నెటివర్క్‌లో. అయినా, సెలబ్రిటీల విడాకుల ఎపిసోడ్ అంటే, మన నెటిజనానికి భలే సరదా ఆయె. ఆ సరదా కాస్తా ఈ మధ్య ఓ విపరీతమైన పైత్యంలా మారిపోయింది.
నిప్పు లేనిదే పొగ రాదు.. అనేలా కాస్తో కూస్తో గిల్లి కజ్జాలున్న దంపతుల్ని విడగొట్టేసినా ఫర్వాలేదు. కానీ, ఇదిగో ఇలా చక్కగా ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్న స్నేహ, ప్రసన్నలాంటి ముచ్చటైన దంపతుల మధ్య చిచ్చు పెట్టుడేందో.!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!









