‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ వస్తోందోచ్.!
- November 14, 2022
దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం అందుకోవడంతో పాటూ, విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
రామ్ చరణ్, ఎన్టీయార్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సంచలనం సృష్టించింది.
ఇటీవలే జపాన్‌లోనూ రిలీజై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అలాగే, ఆస్కార్ బరిలోనూ ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది. ఇక, తాజాగా అమెరికాలో ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళి స్వయంగా ఈ సినిమాకి సీక్వెల్ వుండబోతోందని వివరించారు.
గతంలోనూ ‘ఆర్ఆర్ఆర్’ కథా రచయిత, రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్, ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ గురించి లీక్ ఇచ్చారు. ఇప్పుడు స్వయంగా రాజమౌళి అధికారికంగా అనౌన్స్ చేసేశారు. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా వున్న రాజమౌళి ఫ్యాన్స్‌తో పాటూ, ఇటు చరణ్ అభిమానుల్ని, అటు ఎన్టీయార్ అభిమానుల్ని సైతం హుషారెత్తిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది.? అనే విషయం మాత్రం ఇప్పుడప్పుడే చెప్పలేనన్నారు జక్కన్న.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









