బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ ప్రారంభం

- November 14, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ ప్రారంభం

బహ్రెయిన్: బహ్రెయిన్ లో వింటర్ క్యాంపింగ్ సీజన్ ప్రారంభమైంది. శీతాకాలం గాలులు వీస్తున్న నేపథ్యంలో చాలా మంది ప్రజలు రాజధాని మనామాకు దక్షిణంగా దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సఖిర్ ఎడారికి తరలివెళుతున్నారు. అక్కడ గుడారాలు వేసుకొని ఉంటున్నారు. కింగ్‌డమ్ క్యాంపింగ్ సీజన్‌లో చాలా మంది బహ్రెయిన్‌లు, ప్రవాసులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి బహిరంగ, సురక్షితమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఎడారి ప్రాంతాలకు వెళతారు.  సాధారణంగా క్యాంపింగ్ సీజన్ నవంబర్ నెలలో ప్రారంభమై మార్చి వరకు ఉంటుంది. సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలీ అల్ ఖలీఫా మాట్లాడుతూ.. క్యాంపింగ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ప్రజా భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గూడారాల సమీపంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోకుండా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరికీ సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com