రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన సీఎం రమేష్
- November 14, 2022
న్యూ ఢిల్లీ: రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేష్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీఎం రమేశ్… 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సీఎం రమేశ్… వరుసగా పదేళ్లకు పైగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా ఆయనను నియమిస్తూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం పార్లమెంటులో ఆయన రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా తనకు కేటాయించిన కార్యాలయంలో ఆయనకు హౌస్ కమిటీ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు చేపట్టిన రమేశ్… కమిటీకి చెందిన కార్యకలాపాలపై అధికారులతో సమీక్షించారు. కొత్తగా సభకు ఎన్నికైన వారికి రాజధానిలో సర్కారీ బంగ్గాలను కేటాయించడం, పదవీ కాలం పూర్తయిన సభ్యులను ఆయా బంగ్లాల నుంచి ఖాళీ చేయించడం కూడా ఈ కమిటీ బాధ్యతే. ఇక సభ్యులకు కేటాయించిన బంగ్లాల్లో ఆయా సౌకర్యాల ఏర్పాటును కూడా ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









