‘ఆదిపురుష్’ రీషూట్స్ జరుగుతున్నాయా.?
- November 15, 2022
దసరా సందర్భంగా రిలీజ్ చేసిన ‘ఆదిపురుష్’ టీజర్‌కి నెటిజన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చిన సంగతి తెలిసిందే. సినీ వర్గాల్లోనే కాదు, రాజకీయ వర్గాల నుంచి కూడా ఈ టీజర్ బోలెడంత నెగిటివిటీ మూట కట్టుకుంది. సామాన్యులయితే మరీను.
హిందూత్వ వాదులు రామాయణాన్నీ, ఎంతో పవిత్రంగా భావించే అందులోని పాత్ర ధారుల్ని ఈ సినిమాతో వక్రీకరిస్తున్నారనీ, కించ పరుస్తున్నారనీ ఆరోపించారు. దాంతో, వెనక్కి తగ్గిన ‘ఆది పురుష్’ టీమ్ ముందుగా అనుకున్న రిలీజ్ డేట్‌ని పోస్ట్‌పోన్ చేసుకుంది.
జనవరిలో రావల్సిన ‘ఆది పురుష్’ జూన్‌కి వాయిదా పడింది. కాగా, ప్రస్తుతం ‘ఆది పురుష్’లోని పాత్రల డిజైన్ని మార్చేస్తున్నారనీ, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్.. ఇలా మొత్తం మొదటి నుంచీ జాగ్రత్తలు తీసుకుంటున్నారనీ తెలుస్తోంది. టోటల్‌గా రీ షూట్ చేస్తున్నారనీ అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.
రాముడి పాత్ర నుంచి, రావణుడి పాత్ర వరకూ మొత్తం పాత్రలను రీ డిజైన్ చేస్తున్నారట. కాస్త వేగంగా, ఇంకాస్త జాగ్రత్తగా టీమ్, వర్క్ చేస్తోందట. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. యువీ క్రియేషన్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది.
సీత పాత్రలో కృతి సనన్ నటిస్తోన్న ఈ సినిమాలో రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







