దుబాయ్ ఎయిర్ పోర్టులో బయోమెట్రిక్ చెక్-ఇన్: నాన్ రెసిడెంట్స్ కు విస్తరణ

- November 15, 2022 , by Maagulf
దుబాయ్ ఎయిర్ పోర్టులో బయోమెట్రిక్ చెక్-ఇన్: నాన్ రెసిడెంట్స్ కు విస్తరణ

దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణికులకు (నాన్ రెసిడెంట్స్) బయోమెట్రిక్ చెక్ ఇన్ ప్రక్రియను ప్రారంభించనుంది. దీంతో విమానాశ్రయం నుంచి నాన్ రెసిడెంట్ ప్రయాణికుల చెక్ ఇన్ ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ మేరకు నిర్ణయించిన ఒప్పందంపై దుబాయ్‌లోని జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ హిస్ ఎక్సలెన్సీ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి, ఎమిరేట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అడెల్ అల్ రెధా లు సంతకాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ఒప్పందం మొదటిదని అధికారులు తెలిపారు.  జిడిఆర్ఎఫ్ఎ, ఎమిరేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దుబాయ్ సందర్శకులకు వినూత్న, డిజిటల్ ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందన్నారు. ఈ ఒప్పందం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 లోపల ప్రయాణీకుల ట్రాఫిక్ విధానాలను మెరుగుపరుస్తుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com