సహమ్ హాస్పిటల్‌లో జన్మించిన 5 కిలోల బరువున్న శిశువు

- November 15, 2022 , by Maagulf
సహమ్ హాస్పిటల్‌లో జన్మించిన 5 కిలోల బరువున్న శిశువు

మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లో ఆదివారం అరుదైన కేసు నమోదైంది. 5 కిలోల బరువుతో ఆడ శిశువు జన్మించింది. ఈ మేరకు నార్త్ అల్ బతినాలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తెలిపింది. సహమ్ హాస్పిటల్‌లో 5 కిలోల బరువున్న ఆడ శిశువు జన్మించిందన్నారు. సిజేరియన్ చేయాల్సిన అవసరం లేకుండా.. నిపుణుల పర్యవేక్షణలో శిశువు జన్నించిందని, చిన్నారి ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉందని సహామ్ స్టేట్ హాస్పిటల్‌లోని ప్రసూతి, గైనకాలజీ నిపుణుడు డాక్టర్ హనన్ మోమెన్ అల్-సయీదీ తెలిపారు. సాధారణంగా శిశువు జన్మించిన సాధారణ బరువు 3.03 నుండి 3.6 కిలోగ్రాములు.. పొడవు 48.51 నుండి 51 సెం.మీ వరకు ఉంటుందన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com