దుబాయ్ ఎయిర్ పోర్టులో బయోమెట్రిక్ చెక్-ఇన్: నాన్ రెసిడెంట్స్ కు విస్తరణ
- November 15, 2022
దుబాయ్: ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణికులకు (నాన్ రెసిడెంట్స్) బయోమెట్రిక్ చెక్ ఇన్ ప్రక్రియను ప్రారంభించనుంది. దీంతో విమానాశ్రయం నుంచి నాన్ రెసిడెంట్ ప్రయాణికుల చెక్ ఇన్ ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ మేరకు నిర్ణయించిన ఒప్పందంపై దుబాయ్‌లోని జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ జనరల్ హిస్ ఎక్సలెన్సీ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి, ఎమిరేట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అడెల్ అల్ రెధా లు సంతకాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ఒప్పందం మొదటిదని అధికారులు తెలిపారు. జిడిఆర్ఎఫ్ఎ, ఎమిరేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం దుబాయ్ సందర్శకులకు వినూత్న, డిజిటల్ ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందన్నారు. ఈ ఒప్పందం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 లోపల ప్రయాణీకుల ట్రాఫిక్ విధానాలను మెరుగుపరుస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







