పాఠశాల విద్యార్థులకు ‘రీడింగ్ లిటరసీ అసెస్ మెంట్’ తప్పనిసరి
- November 15, 2022
దుబాయ్: నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (KHDA) ద్వారా సంవత్సరానికి మూడు సార్లు నిర్వహించబడే ప్రామాణిక రీడింగ్ లిటరసీ అసెస్ మెంట్ అధికారికంగా తప్పనిసరి చేశారు. ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ ప్రకారం.. 6-15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరూ పరీక్షకు హాజరుకావాలని షరతు విధించారు. దుబాయ్‌లోని అన్ని పాఠశాలలు 1 నుండి 12 తరగతుల డిజిటల్ పఠన అక్షరాస్యత మూల్యాంకనం(అసెస్ మెంట్), అరబిక్ బెంచ్‌మార్క్ పరీక్షలో 1 నుండి 9వ తరగతి వరకు 2023-24 విద్యా సంవత్సరం నుండి అమలులోకి రానున్నాయి.
GEMS వరల్డ్ అకాడమీ – దుబాయ్ అసిస్టెంట్ ప్రిన్సిపల్ పీటర్ బోన్నర్ మాట్లాడుతూ.. KHDA మార్గదర్శకాల ప్రకారం.. 6-15 సంవత్సరాల వయస్సులో ఉన్న విద్యార్థులందరూ సంవత్సరానికి మూడుసార్లు ప్రామాణిక రీడింగ్ లిటరసీ మూల్యాంకనానికి హాజరు కావాలి.
క్రెడెన్స్ హై స్కూల్ సీఈఓ- ప్రిన్సిపల్ దీపికా థాపర్ సింగ్ మాట్లాడుతూ.. పఠన సాహిత్య మూల్యాంకనం బాహ్యంగా, ప్రామాణికంగా, విశ్వసనీయంగా ఉండాలన్నారు. అన్ని పాఠ్యాంశాల్లోని విద్యార్థులకు వర్తించేలా ఉండాలి. ఈ మూల్యాంకనాలను రీడింగ్ లిటరసీని అంతర్జాతీయ పఠన అక్షరాస్యత అధ్యయనం (PIRLS), ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (PISA) ద్వారా మూల్యాంకనం చేయబడిన వాటికి అనుగుణంగా పఠన నైపుణ్యాలను అంచనా వేయాలన్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







