Dh85,000 తీసుకున్నాడని వ్యక్తిపై ఆరోపణలు చేసిన మహిళ.. దావా కొట్టివేత
- November 16, 2022
యూఏఈ: పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తన నుంచి 85,000 దిర్హామ్‌లు తీసుకున్నాడని ఓ వ్యక్తిపై ఓ అరబ్ యువతి కేసు పెట్టింది. అబుధాబిలోని ఒక షాపింగ్ సెంటర్లో ఉన్న వ్యక్తికి కొంత డబ్బును అందజేసి, మిగిలిన మొత్తాన్ని అతని బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసినట్లు ఆమె తన దావాలో చెప్పింది. తాను ఆ వ్యక్తికి మొత్తం 85,000 దిర్హామ్‌లు ఇచ్చానని, దానిని తిరిగి ఇస్తానని అతను తనకు వాగ్దానం చేశాడని ఆ మహిళ కోర్టుకు తెలిపింది. తనని పెళ్లి చేసుకుంటానని చెప్పినందుకే ఆ వ్యక్తిని నమ్మినట్లు సదరు మహిళ తెలిపింది. అయితే, కొంతకాలం తర్వాత ఆ వ్యక్తి తనను నిర్లక్ష్యం చేశాడని, తన డబ్బు తిరిగి చెల్లించమని అడిగితే.. అతను నిరాకరించాడని మహిళ ఆరోపించింది. దీంతో ఆ మహిళ తన నగదును తిరిగి చెల్లించేలా సదరు వ్యక్తిని ఆదేశించాలని డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించింది. కాగా, ఆ వ్యక్తి మహిళ చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ మేరకు దేవునిపై ప్రమాణం చేశాడు. అబుధాబి ఫ్యామిలీ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ తగిన సాక్ష్యాధారాలు లేనందున మహిళ వ్యాజ్యాన్ని గతంలో తిరస్కరించింది. మొదటి కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తాజాగా అప్పీల్ కోర్టు కూడా సమర్థిస్తూ.. మహిళ దావాను కొట్టివేసింది. అలాగే నిందితుడికి న్యాయపరమైన ఖర్చులు చెల్లించాలని మహిళను కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







