కృష్ణ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించిన బాలకృష్ణ
- November 16, 2022
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నందమూరి బాలకృష్ణ నివాళ్లు అర్పించారు. పద్మాలయా స్టూడియోలో అభిమానుల సందర్శనార్థం కృష్ణ పార్థివ దేహాన్ని ఉంచారు. ఉదయం నుండి తమ అభిమాన హీరోను కడసారి చూసేందుకు అభిమానులు బారులు తీరారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాదు పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది అభిమానులు చేరుకొన్నారు. ఓ గొప్ప నటులను కోల్పాయామని వారంతా బాధపడుతున్నారు. అభిమానులతో పాటు సినీ స్టార్స్ సైతం కృష్ణ కు నివాళ్లు అర్పిస్తున్నారు.
కొద్దీ సేపటి క్రితం నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కృష్ణ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించారు. అనంతరం మహేష్ తో మాట్లాడి ధైర్యం చెప్పారు. అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ముల , త్రివిక్రమ్, మెహర్ రమేష్ తదితరులు నివాళ్లు అర్పించారు. మరికాసేపట్లో ఏపీ సీఎం జగన్ కృష్ణ పార్థివ దేహానికి నివాళ్లు అర్పించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత పూజా కార్య క్రమాలు జరిపి, అంతిమ యాత్ర మొదలుపెడతారు. 3 గంటల ప్రాంతంలో మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ గారి అంత్యక్రియలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







