45వ కువైట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభం
- November 17, 2022
కువైట్: కువైట్ లో అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంలో ఒకటైన 45వ కువైట్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన మిష్రెఫ్ ఫెయిర్ గ్రౌండ్లో ప్రారంభమైంది. ఫెయిర్‌ను కువైట్ సమాచార- సాంస్కృతిక-యువజన వ్యవహారాల మంత్రి, జాతీయ సంస్కృతి- కళలు-లేఖల మండలి చైర్మన్ అబ్దుల్రహ్మాన్ అల్-ముతైరీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ఈ నెల 26 వరకు జరగనుంది. పుస్తక ప్రదర్శన సందర్భంగా జరిగే కార్యకలాపాలు అనుభవాలు, సంస్కృతులను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి గొప్ప అవకాశం అని, ఇది సమాజాల అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి అల్-ముతైరీ అన్నారు.
బుక్ ఫెయిర్‌లో మొత్తం 29 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో 18 అరబ్ దేశాలు సహా 11 విదేశీ, అలాగే 404 పబ్లిషింగ్ హౌస్ లు, 117 ఇతర సంస్థలు ఉన్నాయి. ఈ సారి ఇటలీ గౌరవ అతిథిగా పాల్గొంటోంది. కువైట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ 5, 6, 7, 7B హాల్స్‌లో జరుగుతుంది. ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు.. తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 10:00 వరకు బుక్ ఫెయిర్ ఓపెన్ ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 4:00 నుండి 10:00 వరకు తెరిచి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం