మానవ అక్రమ రవాణా కేసు: ప్రధాన నిందితుడికి జీవిత ఖైదు
- November 17, 2022
బహ్రెయిన్ : గృహ కార్మికులను వారి అసలు స్పాన్సర్‌ల నుండి పారిపోయేలా ప్రోత్సహించి, ఆపై వారిని అక్రమ రవాణా చేసినందుకు బహ్రెయిన్ వ్యక్తికి విధించిన జీవితఖైదును కాసేషన్ కోర్టు సమర్థించింది. నిందితుడికి మొదట 10 సంవత్సరాల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. కానీ నేరంలో అతను ప్రధాన పాత్ర వహించాడని హై అప్పీల్స్ కోర్టు అతని శిక్షను జీవిత ఖైదుకు పెంచింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. గృహ సేవకులు తమ స్పాన్సర్‌ల నుండి పారిపోయేలా ప్రోత్సహించడానికి క్రిమినల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసినందుకు అరెస్టయిన 19 మందిలో ఇతను ప్రధాన నిందితుడు. ఆపై వారిని అపార్ట్‌మెంట్‌లలో బంధించి అక్కడ వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేవారు. నిందితుడు ఈ నెట్‌వర్క్‌కు సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో మిగతా 17 మందికి 10 ఏళ్ల జైలు శిక్షన కోర్టు విధించింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం