దోహాలో కొత్తగా మూడు బీచ్ క్లబ్‌లు ప్రారంభం

- November 17, 2022 , by Maagulf
దోహాలో కొత్తగా మూడు బీచ్ క్లబ్‌లు ప్రారంభం

దోహా: ఖతార్ లో పర్యాటకులను ఆకట్టుకునేందుకు వెస్ట్ బే బీచ్, B12 బీచ్ క్లబ్, దోహా సాండ్స్‌ను కొత్తగా ప్రారంభించినట్లు ఖతార్ టూరిజం (QT) వెల్లడించింది. దోహా నడిబొడ్డున కతార్‌కు సహజంగా అందమైన తీరప్రాంతాన్ని తలపిస్తూ అద్భుతంగా ఉన్న మూడు కొత్త బీచ్ క్లబ్‌లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి బీచ్‌లో వాలీబాల్ కోర్ట్, పర్పస్-బిల్ట్ ఫ్యాన్ జోన్, వెస్ట్ బే బీచ్‌లో రుచికరమైన ఫుడ్ కోర్ట్‌తో సహా అనేక సౌకర్యాలను సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. B12 బీచ్ క్లబ్‌లో 600 సన్ లాంజర్‌లు, వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలు, డైనింగ్, పిల్లల ఆట స్థలం ఏర్పాటు చేశారు. దోహా సాండ్స్‌లో 1,000 సన్ లాంజర్‌లు, మ్యూజిక్ వేదిక, ఫుడ్ అవుట్‌లెట్‌లు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. బీచ్ ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఖతార్ టూరిజం చైర్మన్, ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ HE అక్బర్ అల్ బేకర్ మాట్లాడుతూ.. ఖతార్ టూరిజంలో తరఫున బడ్జెట్‌లో మంచి ఆఫర్‌లను అందించేందుకు కృషి చేస్తామన్నారు. 2030 నాటికి సంవత్సరానికి ఆరు మిలియన్ల మంది సందర్శకులను స్వాగతించడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com