షాకింగ్.! భర్త ఫోటోని పరిచయం చేసిన మిల్కీ బ్యూటీ.!
- November 17, 2022
మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకోబోతోందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ముంబయ్‌కి చెందిన వ్యాపార వేత్తను తమన్నా పెళ్లి చేసుకోబోతోందంటూ వరుస కథనాలు వినిపిస్తున్నాయ్.
ఈ కథనాలు ఆ నోటా ఈ నోటా తమన్నా చెవిని చేరాయనుకుంటా.! తాజాగా తన భర్త ఫోటో ఇదే.. అంటూ ఓ ఫోటో పోస్ట్ చేసి నెటిజన్లకు బిగ్ షాక్ ఇచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా.
తనకు తెలియకుండానే పెళ్లి సంబంధం ఫిక్స్ చేసేసిన నెటిజనానికి తమన్నా ఇచ్చిన షాక్‌తో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. తమన్నా అబ్బాయి గెటప్‌లో వున్న ఫోటో అది. ఈయనే నా భర్త.. అంటూ తమన్నా పోస్ట్ చేసింది.
‘ఎఫ్ 3’ సినిమాలో తమన్నా అబ్బాయ్ గెటప్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోనే తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేసింది తమన్నా. దీంతో, తమన్నా ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదనీ, ఇంతవరకూ జరిగిన ప్రచారం జస్ట్ టైమ్ పాస్ కోసం నెటిజన్లు సృష్టించిన గాలి వార్తలే అని ఇప్పటికైనా అర్ధం చేసుకుంటారో లేదో నెటిజనం.
ఇక, తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!