ఆన్లైన్ నుసుక్ యాత్రికుల సేవను ప్రారంభించిన సౌదీ హజ్ మంత్రి
- November 18, 2022
మక్కా: యాత్రికుల కోసం ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ ‘నుసుక్’ను అధికారికంగా ప్రారంభించినట్లు సౌదీ అరేబియా హజ్- ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా ప్రకటించారు. విజన్ 2030 లక్ష్యాలలో భాగంగా సౌదీ అరేబియాను సందర్శించే యాత్రికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడే ప్లాట్‌ఫారమ్ నుసుక్ 100 కంటే ఎక్కువ సేవలను అందజేస్తుందన్నారు. నుసుక్ వ్యాపారాలకు 75 సేవలను, వ్యక్తులకు 45 సేవలను అందిస్తున్నట్లు అల్-రబియా తెలిపారు. వ్యాపార రంగంలోని 10,000 కంటే ఎక్కువ సంస్థలు, 25 ప్రభుత్వ సంస్థల సహకారంతో ఇది 30 మిలియన్లకు పైగా ప్రజలకు సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. టూరిజం మంత్రిత్వ శాఖ, సౌదీ టూరిజం అథారిటీ సహకారంతో నిర్వహిస్తున్న విజన్ 2030 యాత్రికుల అనుభవ కార్యక్రమంలో నుసుక్ భాగమని ఆయన చెప్పారు. ఉమ్రా చేసే అన్ని దశలలో మక్కా-మదీనాలోని చారిత్రక ప్రాంతాలు, మతపరమైన ప్రదేశాలకు యాత్రికులను పరిచయం చేయడమే ఈ వేదిక లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని