బహ్రెయిన్ ఎన్నికల్లో ఓటు వేసిన 494 మంది కొవిడ్ రోగులు
- November 18, 2022
బహ్రెయిన్: కోవిడ్-19 వైరస్ సోకిన 494 మంది పౌరులు కొత్త పార్లమెంట్, మునిసిపల్ కౌన్సిల్‌లను ఎన్నుకోవడానికి జరిగిన మొదటి రౌండ్ పోల్స్‌లో ఓటు వేశారు. ఈ విషయాన్ని లెజిస్లేషన్ అండ్ లీగల్ ఒపీనియన్ కమిషన్ అధిపతి, పార్లమెంటరీ, మున్సిపల్ ఎలక్షన్స్ 2022 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవాఫ్ అబ్దుల్లా హమ్జా వెల్లడించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహకారంతో కొవిడ్ సోకిన వారి కోసం ఓటింగ్ ప్రక్రియ విజయవంతంగా అమలు చేయబడిందని ఆయన వివరించారు. కోవిడ్-19 సోకిన వ్యక్తులకు నవంబర్ 19న జరగనున్న రన్ఆఫ్లలో కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు.
ఈ సంవత్సరం పార్లమెంట్ దిగువ సభ 40 స్థానాలకు 561 మంది, 30 స్థానాల మునిసిపల్ కౌన్సిల్లకు 176 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2018తో పోలిస్తే ఇది 20 శాతం అధికం. మొదటి రౌండ్ ఎన్నికలలో మొత్తం 252,256 మంది బహ్రెయిన్లు ఓటు వేశారు. మహిళల్లో 48 శాతం పోలింగ్ నమోదైంది. బహ్రెయిన్ 2022 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 73 శాతం పోలింగ్ నమోదైంది. ఇది 2002లో జరిగిన మొదటి ఎన్నికల తర్వాత అత్యధికం. 2022 ఎన్నికలలో ఓట్లు వేయడానికి అర్హులైన బహ్రెయిన్ల సంఖ్య 344,713గా ఉన్నది.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







